వర్టికల్ గార్డెనింగ్‌తో అడుగులో కూడా మొక్కలు పెంచొచ్చు

వర్టికల్ గార్డెనింగ్‌తో అడుగులో కూడా మొక్కలు పెంచొచ్చు

డ్రీమ్ హోమ్.. మోడర్న్​గా ఉండాలి. ప్రకృతితో అడుగులు వేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా ఉండాలి. శారీరక, మానసిక ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలి. ఇదీ.. ప్రస్తుతం సిటీవాసులంతా కోరుకుంటున్న లైఫ్ స్టైల్. అభిరుచికి తగ్గట్టే ఇంటీరియర్ డిజైన్‌‌లో వర్టికల్‌‌ గార్డెన్‌‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇరుకైన ఇళ్లల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సెట్ చేసుకుంటున్నారు.

వర్టికల్ గార్డెనింగ్ ఫార్ములా నగరంలో బాగా ట్రెండింగ్‌‌ అవుతోంది. మొన్నటివరకూ కంపెనీ గోడలు, ఫ్లై ఓవర్ల పిల్లర్లపైనే కనిపించిన పచ్చని పొదరిల్లులా  తీర్చిదిద్దుతున్నారు. ఒక వేళ గోడలు ఖాళీగా లేకపోయినా గదుల మధ్యలో చెక్కను పెట్టి.. వాటిపైన అందమైన మొక్కలు పెంచుతున్నారు.

అడుగు జాగ ఉంటే చాలు

ఈ వర్టికల్ గార్డెన్‌‌కు పెద్ద స్థలం అక్కరలేదు. ఇంట్లో అడుగు జాగ ఉన్నా అందంగా మొక్కలను డిజైన్ చేయొచ్చు. దీనికోసం నర్సరీలు, ల్యాండ్ స్కేపింగ్ కంపెనీలు రకరకాల ప్యాకేజీలు అందుబాటులోకి తెస్తున్నాయి. ప్లేస్‌‌ని బట్టి ప్యాకేజ్ ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్‌‌ సెటప్‌‌కు రు. 650 ల నుంచి ప్యాకేజీలు మొదలవుతాయి. ప్యాకేజీ ‘ఓకే’ అవగానే ముగ్గురు లేదా నలుగురితో ఉన్న టీమ్ ఇంటికి వచ్చి వర్టికల్ వాల్ సెటప్ చేస్తారు. క్లయింట్​ రిక్వైర్‌‌‌‌మెంట్‌‌ని బట్టి ఇన్​డోర్ లేదా అవుట్‌‌డోర్‌‌‌‌లో ఈ వాల్ సెటప్ ఉంటుంది.

వాటర్ సప్లై

స్టాండ్‌‌లను అమర్చి వాటికి కుండీలను సెట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీళ్లందిస్తూ మొక్కలను పెంచడమే వర్టికల్ గార్డెన్‌ సిస్టమ్. అయితే గార్డెనింగ్ వాల్స్‌‌కి నీళ్లు అందేలా  సెట్​ చేయడం పెద్ద టాస్క్. అవుట్ డోర్‌‌‌‌లో అయితే  డ్రిప్పింగ్ పైప్‌‌లు పెట్టి సెట్ చేస్తారు. కానీ, ఇండోర్‌‌‌‌లో పైపింగ్‌‌ ఇబ్బందిగా మారొచ్చు. అందుకే 2, 3 రోజులకు ఒకసారి మొక్కలకు నీళ్లు పోయాల్సి వస్తుంది.

ఇవే మొక్కలు

వర్టికల్ వాల్స్‌‌లో ఎక్కువగా క్రీపింగ్ ప్లాంట్స్‌‌నే పెడుతుంటారు. సింగోనియమ్, పెపరోమియా, పీస్ లిల్లీలు అట్రాక్టివ్‌‌గా ఉంటాయి. ఆక్సిజన్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్‌‌ వంటివి కూడా కలర్ ఫుల్‌‌గా ఎరేంజ్ చేసుకోవచ్చు. ప్లాంటేషన్​ తర్వాత మెయింటెనెన్స్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి స్క్వేర్ ఫీట్‌‌ని బట్టి ఉంటాయి. నెలా, రెండు నెలలకొకసారి మట్టి మార్చడం, వాటర్ సప్లై సిస్టమ్‌‌ను చెక్ చేయడం, ఎరువులు వేయడం వంటివి కంపెనీ వాళ్లే స్వయంగా చూస్తారు.

వర్టికల్ బిజినెస్

నర్సరీలో పనులు చేసేవాళ్లు, క్రియేటివిటీ ఉన్నవాళ్లు ఈ బిజినెస్‌‌లోకి వస్తున్నారు. ఆర్డర్ తీసుకున్న తర్వాత కస్టమర్‌‌‌‌కు కావాల్సిన విధంగా వర్టికల్ వాల్స్​ను అరేంజ్ చేసి ఇస్తున్నారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్‌‌కు వర్టికల్ వాల్స్‌‌ను గిఫ్ట్‌‌గా ఇస్తున్నారు.

కస్టమర్లు పెరుగుతున్నరు

లాక్ డౌన్ టైంలో మొక్కలు పెంచడంపై చాలామందికి ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. ఎప్పటినుంచో కంపెనీలు, హాస్పిటల్స్ దగ్గర ఈ వర్టికల్ వాల్స్ సెటప్‌ చేస్తున్నాం. ఈ మధ్య ఇళ్లలో సెటప్ చేయించుకునే వాళ్ల సంఖ్య పెరిగింది. ఒక్కోసారి మా డిజైన్లు కస్టమర్‌‌‌‌కు కావాల్సినట్టు అరేంజ్ చేస్తున్నాం. ఈ రెండు, మూడు నెలల్లో వందకు పైగా వర్టికల్ వాల్స్ గార్డెన్​ సెటప్ చేశాం. గార్డెన్ సెట్ చేయడానికి ఒక ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీలోనే మెటీరియల్, ట్రాన్స్ పోర్టేషన్, వర్కర్స్ బిల్స్…అన్నీ ఉంటాయి. కస్టమర్లు హ్యాపీగా ముందుకొచ్చి ఈ వర్టికల్ వాల్స్ తయారు చేయించుకుంటున్నారు. – దివ్య, ప్లాన్ ఏ ప్లాంట్ ఆర్గనైజేషన్

మెయింటెనెన్స్ చాలా ముఖ్యం

ఇదివరకు నర్సరీలో వర్క్ చేసేదాన్ని. లాక్‌‌డౌన్ టైంలో మానేసా. ఆ తర్వాత వర్టికల్ గార్డెన్​ఐడియాతో ఆక్సీజోన్ బియోగ్రీన్ టెక్నాలజీస్ అనే ఆర్గనైజేషన్‌‌ను స్టార్ట్ చేశా. చిన్న స్పేస్ ఉంటే చాలు,  గ్రీనరీతో నింపేయొచ్చు. అది కూడా అందంగా.  ప్రస్తుతం మా దగ్గరకు చాలామంది కస్టమర్లు వస్తున్నారు. వాళ్ల బడ్జెట్‌‌లోనే, వాళ్లు కోరుకున్న విధంగా వర్టికల్ గార్డెన్‌‌ డిజైన్ చేసున్నాం. ప్రతినెలా మెయింటెనెన్స్ కూడా చేయిస్తుంటాం. ఇళ్లతో పాటు హోటల్స్, హాస్పిటల్స్, డూప్లెక్స్ హౌసులు, అపార్ట్ మెంట్లు.. ఇలా అన్నిరకాల ఆర్డర్స్ తీసుకుంటున్నాం. – రాజేశ్వరి నిమ్మగడ్డ

For More News..

బిడ్డను కన్న తొమ్మిది రోజులకే అమ్మిన తల్లి..

పుదుచ్చేరిలో రేపు రాహుల్ పర్యటన.. నేడు మైనార్టీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం

చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం