నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత

నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత

ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  గత కొంతకాలంగా కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న ఆయన పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విక్రమ్ గోఖలే  భౌతికకాయాన్ని బాలగంధర్వ్ రంగమంచ్‌లో అంతిమ దర్శనం కోసం ఉంచుతారు. ఆయన అంత్యక్రియలు సాయంత్రం 6 గంటలకు పూణెలోని వైకుంఠ సంషాన్ భూమిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

40 ఏళ్లకు పైగా కెరీర్‌లో విక్రమ్ గోఖలే ఎన్నో  సినిమాల్లో నటించారు. అనుమతి చిత్రానికి గానూ ఆయన  ఉత్తమ నటుడిగా జాతీయ ఆవార్డు అందుకున్నారు. విక్రమ్ గోఖలే చివరిగా నికమ్మ చిత్రంలో నటించారు. ఈ మూవీ ఈ ఏడాది జూన్‌లో రిలీజైంది. విక్రమ్ గోఖలే మృతిపట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం తెలుపుతుంది.