హిందూ దేవాలయాలను రక్షించండి

హిందూ దేవాలయాలను రక్షించండి
  • మెట్ పల్లిలో బజరంగ్ దళ్, వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ నాయకుల నిరసన

 మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మతోన్మాద ఉగ్రవాదులను  శిక్షించాలని మెట్ పల్లి పట్టణంలో బజరంగ్ దళ్, వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ నాయకులు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. శనివారం బజరంగ్ దళ్, వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ  నాయకులు మీడియాతో మాట్లాడుతూ  ప్రణాళిక బద్ధంగా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నా సీఎం ఏమాత్రం  పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏవో కు వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు  పోహార్ తుకారాం, మెట్ పల్లి ప్రఖండ కార్యదర్శి మర్రి భాస్కర్, టౌన్ సెక్రెటరీ వేములవాడ రాజశేఖర్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు  పాల్గొన్నారు.

కోరుట్ల, వెలుగు: తెలంగాణలో హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్​, బజరంగ్​దళ్​ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. శనివారం కోరుట్ల లో విశ్వహిందూ పరిషత్​, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్​లో  వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్​, బజరంగ్​దళ్​, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు. 

రాయికల్​, వెలుగు: హిందూ ఆలయాల్లో విగ్రహలను ధ్వంసం చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించి, ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దుర్గా భవాని భక్తులు రాయికల్​ పట్టణంలో శనివారం ర్యాలీ నిర్వహించారు.  తహసీల్దార్​ ఖయ్యుంకు వినతిపత్రం అందించారు.