రాజమౌళి ఖబడ్డార్: వీహెచ్పీ

రాజమౌళి ఖబడ్డార్: వీహెచ్పీ

బషీర్​బాగ్, వెలుగు: డబ్బు మదం, అహంకారంతో రాజమౌళి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని వీహెచ్​పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్ మండిపడ్డారు. హిందూ సమాజానికి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై రెండ్రోజుల నుంచి హిందూ సమాజం ఆందోళనలు చేస్తున్నప్పటికీ రాజమౌళి క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు.

 తెలుగు చిత్ర పరిశ్రమలో జిహాద్ మాఫియా నిధులు ఉన్నాయని, అందుకే అనేక సినిమాలతో హిందూ దేవుళ్లను అపహాస్యం చేస్తున్నారన్నారు. అలాంటి దృశ్యాలు చూపెడితే ఇక నుంచి హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజమౌళి ఖబడ్డార్ అంటూ హెచ్చరిస్తూ... యావత్ హిందూ సమాజం ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంకాదహనం ఎలా ఉంటుందో చూపిస్తుందని  హెచ్చరించారు.