నేరస్తులను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే నేరాలు చేస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే తప్పులు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే సెటిల్ మెంట్లు,దందాల పేరుతో దోచుకుతింటున్నారు. చివరికి తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. సస్పెన్షన్ కు గురవుతూ పోలీస్ శాఖకు మాయనిమచ్చగా మారుతున్నారు.
ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.లేటెస్ట్ గా సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. సైదులు వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ మల్టీజోన్ 2 డిఐజికి కంప్లీట్ చేశాడు మహమ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి. భూమి వివాదంలో ఎస్సై సైదులు 50 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే నీపై కేసు పెట్టి రిమాండ్ చేస్తా అని పోలీస్ స్టేషన్ లో వేధించాడని తెలిపారు. బాధితుడి కంప్టైంట్ తో ఎస్సై పై విచారణ చేపట్టారు ఉన్నత స్థాయి అధికారులు.
