పోలీస్​ స్టేషన్స్​లో బాధితులకు దక్కని గౌరవం

పోలీస్​ స్టేషన్స్​లో బాధితులకు దక్కని గౌరవం
  • సెంట్రీ దగ్గర్నుంచి సీఐ దాకా ఒకటే తీరు
  • గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ లీడర్స్, మీడియేటర్లదే హవా
  • ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులపై కంప్లైంట్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్​ వ్యవస్థ దారితప్పింది. కంప్లైంట్ చేసేందుకు స్టేషన్​కు వచ్చే బాధితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నది. సెంట్రీ దగ్గర్నుంచి ఇన్​స్పెక్టర్ దాకా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనికితో డు ఎంక్వైరీ పేరుతో అమాయకులను స్టేషన్​కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇది కా స్త వారి ప్రాణాలు తీస్తున్నది. చేయని నేరాన్ని ఒ ప్పించేందుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్​మెంట్ ఇవ్వడంతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురులో మరియమ్మ, మెదక్​లో ఖదీర్​ఖాన్ చనిపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అయినా, మేం మారం అన్నట్లుగా కొత్తకోట సీఐ ఓ వ్యక్తితో వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి నిరంజన్​రెడ్డిపై వైరల్ అవుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శివకుమార్​ అనే వ్యక్తిని కొత్తకోట సీఐ దారుణంగా కొట్టాడు. బూటు కాలితో తన్నుతూ.. బూతులు తిడుతూ.. ఒళ్లు కమిలిపోయేలా బెల్టుతో దాడి చేశాడు. ఈ ఘటనపై బాధితుడు హెచ్ఆర్​సీలో కంప్లైంట్ చేశాడు.  

దురుసుగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌

రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పోలీసులు ఇలా గే వ్యవహరిస్తున్నారు. ఏ స్టేషన్​లో కూడా ఫ్రెం డ్లీ పోలీసింగ్ అమలు కావడం లేదు. జిల్లా, మం డల కేంద్రాల్లో అయితే హోంగార్డులు కూడా పోలీస్ బాస్​లా ఫీలవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో లోకల్​ లీడర్లు చెప్పిందే చ ట్టం, మీడియేటర్లే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరి స్తున్నారు. స్టేషన్‌‌‌‌‌‌‌‌ బయట జరిగే చాలా సెటిల్​మెంట్స్​లో ఖాకీల పాత్ర ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సివిల్ వివాదాల్లోనూ తలదూరుస్తున్నారనే ఆరోపణ లున్నాయి. పీఎస్‌‌‌‌‌‌‌‌కు వచ్చే బాధితుల పట్ల సెంట్రీ, రిసెప్షనిస్ట్, కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ తీసుకునే అధికారి అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు డీజీపీ దా కా పోతున్నాయి. సమస్య మొత్తం వినకుండానే దురుసుగా మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు ఎస్​పీ, సీపీ, డీజీపీలకు ఫిర్యా దు చేస్తే.. మరికొందరు ఫేస్​బుక్, ట్విట్టర్ వేదికగా స్టేషన్​లో తమకు జరిగిన అవమానాన్ని పోస్ట్ చేస్తున్నారు.

సైబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌క్రైమ్‌‌‌‌‌‌‌‌లో సపోర్ట్ చేస్తలేరు

బాధితులకు సైబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌క్రైమ్‌‌‌‌‌‌‌‌ పోలీసులు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌ లేదా పీఎస్‌‌‌‌‌‌‌‌కి వెళ్లి కంప్లైంట్​ చేసినా రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మ్యారేజ్ ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ కేసులో రూ.3.5 లక్షలు కోల్పోయినట్లు ఓ మహిళ డీజీపీకి ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. నాలుగు నెలల కింద సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ చేశానని తెలిపారు. పీఎస్‌‌‌‌‌‌‌‌ చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేదని ట్వీట్‌‌‌‌‌‌‌‌లో వివరించారు. ‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లోని కొంత మంది పోలీసులే నేరస్తులకు సపోర్ట్​ చేస్తున్నట్లు ఆరోపించారు. లోయర్ కేడర్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందులు పడుతున్నట్లు పోస్ట్ చేశారు. 

ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంప్లైంట్స్‌‌‌‌‌‌‌‌ జోరు 

టీఎస్‌‌‌‌‌‌‌‌ డీజీపీ పోలీస్‌‌‌‌‌‌‌‌ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాలోవర్స్‌‌‌‌‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పీఎస్​లో తమకు ఎదురైన పరిస్థితిని డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆపద సమయంలో పీఎస్‌‌‌‌‌‌‌‌కి వెళ్లిన వారిపట్ల సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌ పెడ్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ను వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిలో మార్పు తీసుకురావాలని కోరుతున్నారు. ఇలాంటి పోస్టింగ్స్​ను మరికొంత మంది నెటిజన్లు రీ ట్వీట్​ చేస్తూ ట్యాగ్​ చేస్తున్నారు. పోలీసు వ్యవస్థపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కొత్తగా చేరిన ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు.. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో నేర్చుకున్నది డ్యూటీలో మర్చిపోతున్నారని కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. రిసిప్షనిస్ట్​ నుంచి కంప్లైంట్​ తీసుకునే అధికారి దాకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.