మెదక్ జిల్లాలో గ్రీవెన్స్ కు క్యూ కట్టిన బాధితులు

మెదక్ జిల్లాలో గ్రీవెన్స్ కు క్యూ కట్టిన బాధితులు

సంగారెడ్డి టౌన్ ,వెలుగు :  ధరణిలో దొర్లిన తప్పులను సవరించి తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు సోమవారం కలెక్టరేట్​లో అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​సెల్ కు జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి అదరపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి , డీఆర్ఓ నగేశ్ వినతి పత్రాలు స్వీకరించారు. 108 దరఖాస్తుల వచ్చాయి. ప్రధానంగా 83 రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించి 25 దరఖాస్తులు వచ్చాయి.  గ్రీవెన్స్ ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఆఫీసర్లను కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు.

 సిద్దిపేటలో 25 దరఖాస్తులు 

సిద్దిపేట టౌన్, వెలుగు : కలెక్టరేట్​లో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడిస్) గరిమా అగ్రవాల్   సోమవారం ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. భూ సంబంధిత, డబుల్​ బెడ్​ రూం  ఇళ్లు, ఆసరా పింఛన్లు, తదితర సమసల్యను పరిష్కరించాలని మొత్తం 25 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్టీఏ పీడీ జయదేవ్ ఆర్యా,  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ లో 87 అప్లికేషన్లు

మెదక్, వెలుగు :  సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 87 అప్లికేషన్లు వచ్చాయి. పింఛన్ లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బందు, ధరణీ సమస్యలు పరిష్కరించాలంటూజిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు అర్జీలు అందజేశారు.  సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు.