క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని కలిసిన వెంకటేష్

క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని కలిసిన వెంకటేష్

హీరో వెంకటేశ్‌ తన అభిమాని ఆకాంక్షను నెరవేర్చాడు. బోన్స్ క్యాన్సర్‌ తో బాధపడుతున్న సురేశ్‌ అనే అభిమానిని కలిసి, కాసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. సురేశ్‌ నివాసంలో వెంకటేశ్‌ ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకీ మంచి మనసును నెటిజన్లు మెచ్చుకున్నారు.

వెంకటేశ్‌ ఇటీవల ‘f2’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘వెంకీమామ’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో నాగచైతన్య మరో హీరోగా నటిస్తుండగా.. పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది యూనిట్.‌