వెండి దేవాలయం, బంగారు విగ్రహాలతో.. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి ఆహ్వాన బ్యాక్స్ వైరల్

వెండి దేవాలయం, బంగారు విగ్రహాలతో.. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి ఆహ్వాన బ్యాక్స్ వైరల్

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో వివాహం జరగనుంది. ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12న వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరగబోతోంది. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

 ఇటీవల, నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మొదటి ఆహ్వానాన్ని అందించారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీలకు కూడా పెళ్లికి ఆహ్వానం అందింది. అయితే, ఈ పెళ్లికి ఆహ్వానించేందుకు వారు ఒక ప్రత్యేకమైన బాక్స్ డిజైన్ చేయించారు. ఈ బ్యాక్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.

ఎరుపు రంగులో ఉన్న ఆహ్వానం బ్యాక్స్ ఓపెన్ చేయగానే..  ఓ చిన్న వెండి దేవాలయం ఉంది. ఇందులో గణేశుడు, రాధా-కృష్ణుడు, దుర్గాదేవి, లక్ష్మి దేవితో సహా హిందూ దేవతల బంగారు విగ్రహాలు  ఉన్నారు. ఈ బ్యాక్స్ లో అతిథులకు పలు బహుమతులు కూడా ఉన్నాయి.  పూల డిజైన్‌ల మధ్య 'AR' అనే మొదటి అక్షరాలు ఉన్న తెల్లటి క్లాత్ ఉంది. ఆహ్వానంతోపాటు, అతిథులకు ఊదారంగు శాలువా, స్వీట్లు కూడా అందిస్తున్నారు.

కాగా.. అనంత్, రాధికల వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ ఆచారాలతో వైభవంగా జరగనున్నట్లు ఆహ్వాన బాక్స్ ను చూస్తే అర్థమవుతోంది.