చిన్నారి చేష్టలకు నవ్వాపుకోని డాల్ఫిన్!

చిన్నారి చేష్టలకు నవ్వాపుకోని డాల్ఫిన్!

న్యూఢిల్లీ: మీరు ఎప్పుడైనా డాల్ఫిన్ నవ్వడాన్ని చూశారా? లేదా అయితే ఈ వీడియో చూసేయండి. చిన్నారి చేష్టలకు డాల్ఫిన్ నవ్వడాన్ని చూస్తే మీకూ నవ్వాగక మానదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ లిట్ అనే యూజర్ సదరు వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. డాల్ఫిన్ ను నవ్వేలా చేసిన చిన్నారి అంటూ ఈ ట్వీట్ కు క్యాప్షన్ ను జత చేశారు. వివరాలు.. అక్వేరియంలో తీసిన ఈ వీడియోలో ఒక తండ్రి తన కూతురును సరదాగా ఎత్తుకొని ఆడిస్తూ కనిపించాడు. తన పాపను సదరు తండ్రి చేపలా గాలిలో ఆడించడంతో అక్వేరియంలోని డాల్ఫిన్ వారిని చూసి ఆగుతుంది. పాపను చేపలా ఊిపిన ప్రతిసారి డాల్ఫిన్ నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోకు ట్విట్టర్ లో మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 102కే వ్యూస్ వచ్చాయి. వీడియోలోని వ్యక్తికి తన పాపతోపాటు డాల్ఫిన్ ను సంతోషంగా ఎలా ఉంచాలో తెలుసునని, ప్రేమను పంచడం డాల్ఫిన్ కు తెలుసంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సరదా  వీడియోను మీరూ చూసేయండి.