వీడియో: అక్తర్ వారసుడు దొరికాడు.. అదే స్టైల్.. అదే యాక్షన్

వీడియో: అక్తర్ వారసుడు దొరికాడు.. అదే స్టైల్.. అదే యాక్షన్

పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా షోయబ్ అక్తర్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసాడు. తన ఫాస్ట్ బౌలింగ్ తో ఎంతో మంది టాప్ బ్యాటర్లను సైతం ముప్పు తిప్పలు పెట్టిన ఈ స్పీడ్ స్టార్ ఫాస్ట్ బౌలింగ్ లో ఒక ట్రెండ్ సృష్టించాడు. అయితే అక్తర్ లా బౌలింగ్ వేసేవారు ఇక క్రికెట్ లో దొరకరని భావించారు. చాలా ప్రత్యేకమైన బౌలింగ్ శైలితో ఉండే అక్తర్ బౌలింగ్ యాక్షన్  మరెవరికీ సాధ్యం కాదనుకున్నారు. కానీ అక్తర్ వారసుడు  దొరికినట్లుగాగానే కనిపిస్తుంది.

ALSO READ : అక్కడ అలాంటి బట్టలు వేసుకుంటే.. జైల్లో పెడతారట..

 
అతని పేరు మహమ్మద్ ఇమ్రాన్. ఒమాన్ దేశానికి చెందినవాడు. చూడడానికి అచ్చం అక్తర్ లాగే ఉంటాడు. ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటే పొరపాటే. ఎందుకంటే పోలికలోనే కాదు బౌలింగ్ స్టయిల్, యాక్షన్ లో అచ్చం అక్తర్ ని దించేసాడు. ఎవరైనా ఇమ్రాన్ బౌలింగ్ చూస్తే అక్తర్ బౌలింగ్ చేస్తున్నడేంటి? అనే అనుమానం కలగక మానదు. ప్రస్తుతం ఈ ఒమాన్ కుర్రాడి బౌలింగ్ యాక్షన్      సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అక్తర్ వారసుడు దొరికేసాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇతని  బౌలింగ్ యాక్షన్ ని మీరు చూసేయండి.