
రోజు రోజుకీ వింత వింత వంటకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని రకాల ప్రయోగాలు భోజన ప్రియులను ఆకర్షిస్తూ తినాలి అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వంటకు సంబంధించిన వీడియోలోని దోసను చూస్తే .. దేవుడా ఇదేమి దోస.. అనుకుంటారు.. మరి ఆ దోస ఏమిటో తెలుసా..
దోశ అనగానే ఎనీ టైం.. తినేయొచ్చు.. బ్రేక్ ఫాస్ట్ అనే కాకుండా అన్ని వేళ్లల్లో తినేస్తుంటారు. ఇందులో వైరటీలు అంటారా.. ఉల్లి దోశ, మలాసా దోశ, పన్నీర్ దోశ, కారం దోశ, చికెట్ దోశ, ఎగ్ దోశ, తీన్మార్ దోశ, పావు బజ్జీ దోశ , పిజ్జాదోశ, కాజుదోశ, పావ్‌బాజీ దోశ.. ఇలా చెప్పుకుంటూ పోతే వంద రకాల దోశలు ఉంటాయి.. దేశంలోనే ఫస్ట్ టైం పాన్ దోశ వైరటీ తీసుకొచ్చారు.. పాన్ దోశ.. ఏంటీ ఈ మాట వినగానే నోట్లో వేసుకునే పాన్ గుర్తుకొచ్చిందా.. నిజమండీ.. మీరు నోట్లో వేసుకుని కిళ్లీ ఆకులు, బెంగాళీ తమలపాకులతో దోశలు తీసుకొచ్చారు. వినటానికి వెరైటీగానే ఉన్నా.. ఎలా తింటున్నారబ్బా అనే డౌట్ కూడా వచ్చి ఉంటుంది కదా.. కానీ ఎగబడి తింటున్నారండీ ఈ పాన్ దోశను.. ఎక్కడో తెలుసుకుందామా..
దీనిపై నెటిజన్లు మాత్రం బాగా నెగెటివ్ గానే స్పందిస్తున్నారు. వెరైటీ, వైవిధ్యం ఎక్కువైతే వెగటు పడుతుందని.. దోశకు ఉన్న విలువను చంపేస్తున్నారని అంటున్నారు. కొంత మంది అయితే ఈ భూమి మీద బతికే రోజులు పోయాయి.. ఇక బతకలేం అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు అయితే భూమిని వదిలివేసే సమయం ఆసన్నమైంది అంటూ చెప్పుకొచ్చారు. వెరైటీ అనే పదానికే వెగటు పుట్టిస్తున్నారు అంటూ తిట్టిపోస్తున్నారు. పాన్ దోశపై బాగా నెగెటివ్ కామెంట్స్ రావటం విచిత్రం. డిఫరెంట్ ఫుడ్ ను ఎంజాయ్ చేసే మన జనం.. ఈ పాన్ దోశ విషయంలో మాత్రం అసహ్యం వ్యక్తం చేస్తున్నారు
అయితే ఓ విచిత్రమైన కాంబినేషన్‌లో ఓ వ్యక్తి పాన్ దోసె తయారు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ డిష్ ఇంటర్నెట్‌లో అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ట్విట్టర్‌లో హ్యాపీ పేరుతో ఉన్న వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివి గల వీడియోలో.. ఒక వ్యక్తి తమలపాకులతో చేసిన పచ్చి పిండిని వేడి వేడి దోస తవాపై పోశాడు. కొన్ని సెకన్ల తర్వాత ఆ ఆకుపచ్చ పిండికి చాలా వెన్నని కలుపుతాడు. తరువాత తరిగిన పాన్, చెర్రీస్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, ఖర్జూరాలు, అత్తి పండ్లు, టుట్టి ఫ్రూటీ , డ్రై ఫ్రూట్స్ కలుపుతారు. చెఫ్ దానిని టాప్ అప్ చేయడానికి చాలా పాన్ సిరప్ కూడా ఉంచుతాడు. ఇలా అన్ని పదార్ధాలను కలిపి పేస్ట్‌గా తయారు చేస్తాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చాలా మంది వినియోగదారులను షాక్‌కు గురి చేసింది. షేర్ చేసిన 48 గంటల్లోనే ఈ వీడియోకి 1.4 లక్షల మంది వ్యూస్ వచ్చాయి.
https://twitter.com/happyfeet_286/status/1663515121585655809