ఫ్లిప్​కార్ట్ పై వీడియో స్ట్రీమింగ్

ఫ్లిప్​కార్ట్ పై వీడియో స్ట్రీమింగ్

ఆన్​లైన్​ షాపింగ్​ ప్లాట్​ఫామ్​ ‘ఫ్లిప్​కార్ట్’ వీడియో స్ట్రీమింగ్​లోకి అడుగుపెట్టబోతుంది. సినిమాలు, షార్ట్​వీడియోలు, వెబ్​సిరీస్​లను యాప్​ద్వారా యూజర్లకు అందించబోతున్నట్లు ఫ్లిప్​కార్ట్​ తెలిపింది. ‘‘కొంతమంది యూజర్లు ఎంటర్​టైన్​మెంట్​కోసం మాత్రమే నెట్​ వాడుతున్నారు. షాపింగ్​ సైట్లవైపు చూడటం లేదు. ఈ గ్యాప్​ను ఫిల్​ చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.

ఎంటర్​టైన్​మెంట్​తోపాటు, షాపింగ్ ఎక్స్​పీరియన్స్​ కూడా ఒకే ప్లాట్​ఫామ్​పై అందిస్తాం’ అని ఫ్లిప్​కార్ట్​ ప్రతినిధులు తెలిపారు. అయితే యాప్​లో వీడియోలు చూసేందుకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడంలేదని వెల్లడించారు. ఇప్పటికే ఫ్లిప్​కార్ట్​ పోటీదారు ‘అమెజాన్’ సంస్థ ‘ప్రైమ్​ వీడియో’ ద్వారా వీడియో స్ట్రీమింగ్​ సర్వీస్​ అందిస్తున్న సంగతి తెలిసిందే.