
టొరాంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీ పుంజుకున్నాడు. సోమవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో రెండో సీడ్ హికారు నకామురా (అమెరికా)కు చెక్ పెట్టాడు. ఇదే రౌండ్‌లో పోటీ పడ్డ డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద డ్రాతో పాయింట్ పంచుకున్నారు. మరో ఐదు రోజులు మిగిలున్న టోర్నీలో గుకేశ్ 5.5 పాయింట్లతో జాయింట్‌గా టాప్‌లో ఉన్నాడు. విదిత్ 4.5, ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో కొనసాగుతున్నారు. విమెన్స్ సెక్షన్‌లో కోనేరు హంపి తొమ్మిదో రౌండ్‌గేమ్‌లో క్యాథెరీనా లాంగో (రష్యా)తో పాయింట్ పంచుకోగా.. ఆర్. వైశాలి జోంగ్యి టాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. హంపి ఖాతాలో 4, వైశాలి 2.5 పాయింట్లు ఉన్నాయి.