ఆస్కార్ రేసులో విద్యాబాలన్ షార్ట్ ఫిల్మ్

ఆస్కార్ రేసులో విద్యాబాలన్ షార్ట్ ఫిల్మ్

బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ 2021 ఆస్కార్ బరిలో నిలిచింది. ఏదైనా ఫుల్ లెంగ్త్ సినిమా ఆస్కార్ బరిలో నిలవడమే చాలా కష్టం. అటువంటిది ఒక షార్ట్ ఫిల్మ్ ఆ రేసులోకి ప్రవేశించిందంటే ఆశ్చర్యపడాల్సిందే. విద్యాబాలన్ తల్లిగా, ఆమెకు కొడుకుగా సానికా పటేల్ నటించిన ‘నాట్‌కట్’ అనే షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తల్లి తన కొడుకుకు లింగ సమానత్వం గురించి నేర్పుతుంది. అదేవిధంగా మహిళల పట్ల ఎలా నడుచుకోవాలో కూడా తెలుపుతుంది. ఈ సినిమాకు విద్యాబాలన్ నిర్మాతగా కూడా వ్యవహరించింది. రోనీ స్క్రూవాలా సహ-నిర్మాతగా పనిచేశారు. షాన్ వ్యాస్ దర్శకత్వం వహించగా.. అన్నూకంప హర్ష్ కథ రాశారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ జూన్ 2, 2020న విడుదలైంది.

తాను నటించిన షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ బరిలో నిలవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆమె అన్నారు. ‘ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో మా చిత్రం # నాట్కాట్ # OSCARS2021 రేసులో ఉంది’ అని ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

For More News..

సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే పాస్‌పోర్ట్ ఇవ్వరట

ప్రేమ పేరుతో గర్భం.. అబార్షన్ చేయమంటే ఏకంగా గర్భసంచే తొలగించిన వైద్యుడు

డెలివరీ పేరుతో దోపిడీ.. పట్టించుకోని గ్యాస్ ఏజెన్సీలు