
స్టార్ హీరోల చిత్రాల్లో విలన్‌గా నటిస్తూ తెలుగునాట మంచి గుర్తింపును అందుకున్నాడు విద్యుత్ జమ్వాల్. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో చాన్స్ అందుకున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో విద్యుత్ జమ్వాల్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ షెడ్యూల్‌లోనే విద్యుత్ జమ్వాల్ జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో తను గన్ షూట్ చేస్తూ కనిపించడం చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. ఈ చిత్రం హై యాక్షన్ ప్యాక్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. శివ కార్తికేయన్‌తో పాటు విద్యుత్ జమ్వాల్ స్టైలిష్ గెటప్స్‌లో కనిపించనున్నారు. కన్నడ యాక్ట్రెస్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.