
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. 2024 ఏప్రిల్ 09వ తేదీ మంగళవవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజీవ్ రతన్ తుదిశ్వాస విడిచారు.
రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన సీనియర్ అధికారి. కిందటి ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్ బాస్ రేసులో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినపడింది. రాజీవ్ మృతిపట్ల పలువురు ఐపీఎస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పని చేశారు. అలాగే ఆపరేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. మేడిగడ్డపై వ్యవహరంపై విచారణల జరిపిన రాజీవ్ రతన్ .. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.