IPL 2025: ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్‎కు యంగ్ స్పిన్ సంచలనం పుత్తూర్ దూరం

IPL 2025: ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్‎కు యంగ్ స్పిన్ సంచలనం పుత్తూర్ దూరం

ముంబై: లీగులో వరుస విజయాలతో జోష్ మీదున్న ముంబై ఇండియన్స్‎కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యంగ్ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. గాయం కారణంగా పుత్తూర్ మిగిలిన సీజన్ నుంచి వైదొలిగాడు. దీంతో పుత్తూర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను జట్టులోకి తీసుకుంది ముంబై. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‏కు రఘు శర్మతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రఘు శర్మ ఐపీఎల్‎లో ముంబై ఇండియన్స్ జట్టుతో కలవనున్నాడు. 

ఎవరీ రఘు శర్మ..?

పంజాబ్‎లోని జలంధర్‌కు చెందిన 31 ఏళ్ల కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్ రఘు శర్మ పంజాబ్ పుదుచ్చేరి తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. 11 మ్యాచ్‌ల్లో 19.59 సగటుతో 57 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఫస్ట్-క్లాస్ రికార్డు కలిగి ఉన్నాడు. 7/56  రఘు శర్మ అత్యుత్తమ గణాంకాలు.  9 లిస్ట్ A గేములో 14 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ ఆడటం రఘు శర్మకు ఇదే ఫస్ట్. 

పుత్తూర్‎కు ఏమైంది..?

కేరళకు చెందిన 24 ఏళ్ల విఘ్నేష్ పుత్తూర్ ఈ ఏడాది (2025) ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్‎లోకి ఎంట్రీ ఇచ్చాడు. చెన్నైపై అరంగ్రేటం చేసిన పుత్తూర్.. తొలి మ్యాచులోనే రాణించాడు. చెన్నైపై మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడి మొత్తం 6 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే పుత్తూర్ గాయపడ్డాడు. ఇంజ్యూరీ ఎక్కువగా కావడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. జట్టుకు దూరమైనప్పటికీ విఘ్నేశ్ ముంబై ఇండియన్స్ మెడికల్ అండ్ స్ట్రెంగ్త్ & కండిషనింగ్ ఉండనున్నాడు.  

ALSO READ | IPL 2025: శ్రేయాస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. మ్యాచ్ జరుగుతున్నప్పుడే పంజాబ్‌కు పనిష్మెంట్

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన ముంబై జట్టు.. ఈ ఏడాది సీజన్‎ను పేలవంగా ఆరంభించింది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరకు పడిపోయింది. ఇక ముంబై జట్టు పనైపోయిందనుకున్న తరుణంలో తిరిగి బలంగా పుంజుకుంది. వరుసగా ఐదు మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. 

ఈ సీజన్‎లో ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన ముంబై.. 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే.. ముంబై ప్లే ఆఫ్స్‎కు  చేరుకుంటుంది. పాండ్యా సేన ప్రస్తుతమున్న ఫామ్ ను బట్టి చూస్తే ఈ ఏడాది ముంబై ఫ్లే ఆఫ్స్‎కు వెళ్లడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది.