
తమిళ నటుడే అయినా తెలుగులోనూ తన ప్రతి చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. లేటెస్ట్గా తన 26వ సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి ‘లాయర్’ అనే టైటిల్‌ను ప్రకటించాడు.
రీసెంట్‌గా ‘జెంటిల్ వుమన్’సినిమాతో సక్సెస్ సాధించిన జోషువా సేతురామన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలియజేశాడు.
#LAWYER
— vijayantony (@vijayantony) May 19, 2025
The battle begins—not with fists, but with facts 👨⚖️⚖️
#VA26@Dir_Joshua @vijayantonyfilm pic.twitter.com/t47zGvvL5d
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. దీనిపై ‘న్యాయానికి ఒక పేరు ఉంది’అని క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలాగే ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన విజయ్ ఆంటోనీ.. ‘యుద్ధం మొదలైంది.. కానీ పిడికిలితో కాదు.. వాస్తవాలతో’అంటూ పోస్ట్ చేయడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
Justice has a name ⚖️#VA26 First look | 19th | 5PM@Dir_Joshua @vijayantonyfilm pic.twitter.com/U0gasdiYwA
— vijayantony (@vijayantony) May 17, 2025
జూన్ నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.