‘బీస్ట్’ ట్రైలర్ మామూలుగా లేదుగా..

‘బీస్ట్’ ట్రైలర్ మామూలుగా లేదుగా..

తమిళస్టార్​ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా 2.57 నిమిషాల ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఒక షాపింగ్ మాల్ హైజాక్‎కు గురైందని.. వాళ్లను కాపాడాల్సిందిగా విజయ్‎కు ఇన్‎స్ట్రక్షన్స్ వస్తాయి. వాళ్లను కాపాడానికి విజయ్ ఆయుధంతో ఎంట్రీ ఇచ్చే సీన్ అందరికీ నచ్చుతుంది. ఎంతో ఆసక్తిని కలిగించేలా ఉన్న ట్రైలర్ లో విజయ్ చేసే యాక్షన్ సీన్లు, డైలాగులు అదరహో అనిపిస్తాయి. ‘నేను రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అని విజయ్ చెప్పే డైలాగ్ ట్రైలర్​కు హైలెట్​గా నిలిచింది. నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్​పిక్చర్స్​ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్‎గా నటించిన ఈ చిత్రానికి అనిరూధ్​ సంగీతమందించాడు. ట్రైలర్‎తోనే ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

For More News..

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన దీక్షలు

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు రిఫరీగా తెలుగు మహిళ