మసూద వెరీ ఇంటరెస్టింగ్

మసూద వెరీ ఇంటరెస్టింగ్

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి ప్యాన్ ఇండియా రేంజ్‌‌‌‌కి వెళ్లినా.. స్మాల్ బడ్జెట్‌‌‌‌ మూవీస్‌‌‌‌కి బాసటగా నిలుస్తున్నాడు. చిన్న సినిమాలకు తనవంతు సపోర్ట్ చేస్తున్నాడు. తాజాగా ‘మసూద’ మూవీ టీమ్‌‌‌‌కి అభినందనలు తెలియజేశాడు. నవంబర్ 18న విడుదలవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన విజయ్.. రీసెంట్‌‌‌‌గా చిత్రయూనిట్‌‌‌‌తో కాసేపు ముచ్చటించాడు. సినిమా విశేషాలను తెలుసుకుని, ట్రైలర్ ప్రామిసింగ్‌‌‌‌గా ఉందన్నాడు.

‘ట్రైలర్​చూస్తుంటే చాలా ఇంటరెస్టింగ్​ మూవీలా అనిపి స్తోంది. భయపెడుతోంది కూడా. టీమ్‌‌‌‌లో చాలా మంది నాకు తెలుసు. హీరో తిరువీర్ నాతో పాటు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నగేష్​ నా ‘పెళ్లి చూపులు’ కెమెరామేన్. ‘అర్జున్‌‌‌‌ రెడ్డి’ సినిమాకు ఓ షెడ్యూల్ కూడా చేశాడు. నా  ఎదుగుదలకి ఆయన కూడా ఓ ప్రధాన కారణం. అందుకే ఈ సినిమా టీమ్‌‌‌‌కి నా ప్రేమ, అభినందనలు తెలియజేస్తున్నా’ అన్నాడు.  మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాల తర్వాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రమిది. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.