KINGDOM Collection: ‘కింగ్‌డమ్‌’ తొలిరోజు వసూళ్లు ప్రకటించిన మేకర్స్.. గ్రాస్ ఎన్ని కోట్లంటే?

KINGDOM Collection: ‘కింగ్‌డమ్‌’ తొలిరోజు వసూళ్లు ప్రకటించిన మేకర్స్.. గ్రాస్ ఎన్ని కోట్లంటే?

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్‌’ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించారు మేకర్స్. (జూలై 31న) థియేటర్లలో విడుదలైన కింగ్‌డమ్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.

‘రాజు రాక విధ్వంసం సృష్టించింది.. కింగ్‌డమ్‌ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.39కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఆడియన్స్ తమ ప్రదర్శనతో   సృష్టించబడిన అసలైన యుద్ధం’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.

అలాగే, ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.15.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు సైతం వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రూ.15.5కోట్ల నెట్ సాధించింది. తమిళంలో 25 లక్షలు దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇపుడీ వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కథేంటంటే: 

సూర్య అలియాస్ సూరి (విజయ్ దేవరకొండ) ఓ పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన తన అన్న శివ (సత్యదేవ్‌) కోసం వెతుకుతుంటాడు. తన తెగువ, తెలివితేటలు చూసిన అధికారులు.. అతడిని ఓ స్పెషల్‌ ఆపరేషన్‌పై అండర్‌‌ కవర్‌‌ స్పై ఏజెంట్‌గా శ్రీలంకలోని జాఫ్నాకు పంపిస్తామంటారు. అతను స్పైగా వెళ్లబోయే గ్యాంగ్‌కు లీడర్‌‌ శివ.. సూరి వెతుకుతున్న తన అన్నయ్య ఒకరే.

అన్నను వెనక్కి తీసుకొచ్చేందుకు స్పై ఏజెంట్‌గా శ్రీలంక వెళ్లిన సూరి.. అతని స్థానంలో మాఫియా కింగ్‌ ఎందుకు అయ్యాడు? శ్రీకాకుళం నుంచి వెళ్లిన తెలుగు వాళ్లు శ్రీలంకలో ఎందుకు ఉన్నారు? మురుగన్‌ (వెంకిటేష్‌ వీపీ)తో సూరి ఎందుకు తలపడ్డాడు? ఇందులో డా.అను (భాగ్యశ్రీ బోర్సే) పాత్రేమిటి అనేది మిగతా కథ.