డిసెంబర్ 16కు ప్రత్యేక చరిత్ర.. భారత్ దెబ్బకు తోకముడిచిన పాక్ సైన్యం

డిసెంబర్ 16కు ప్రత్యేక చరిత్ర.. భారత్ దెబ్బకు తోకముడిచిన పాక్ సైన్యం

1971లో పాకిస్తాన్‌పై  విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటారు. నాటి భారత సైనికుల ధైర్య సాహసాలు పోరాటాలను స్మరించుకుంటూ ప్రతీ ఏడాది కేంద్రం విజయ్ దివస్ను నిర్వహిస్తోంది. భారత సైన్యం దెబ్బకు పాకిస్థాన్ సైనికులు యుద్ధం చేయలేక తోకముడిచారు. కేవలం 13 రోజుల్లోనే చేతులెత్తేసి భారత సైన్యానికి లొంగిపోయారు. దీని ఫలితంగా తూర్పు పాకిస్తాన్ కు విముక్తి లభించింది. కొత్త దేశంగా  బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. విజయ్ దివస్ రోజు గురించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

భారత్ ముందు తలవంచిన పాక్..

1971 డిసెంబర్ 3న మొదలైన ఇండో-పాకిస్తాన్ యుద్ధం 13 రోజుల పాటు కొనసాగింది.  డిసెంబర్ 16 న అధికారికంగా యుద్ధం ముగిసింది. భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్  లొంగిపోయింది. పదమూడు రోజుల యుద్ధం ఫలితంగా పాకిస్తానీ దళాలు పూర్తిగా లొంగిపోవడంతో  బంగ్లాదేశ్ ఏర్పడింది. దాదాపు 93,000 మంది సైనికులతో పాకిస్థాన్ సైన్యం భారత్ ముందు తలవంచింది.  ఇది "గ్రేటెస్ట్ ఎవర్ విక్టరీ" గా చెప్పుకోవచ్చు. 

పాక్ సైన్యం దాడులు..యుద్ధానికి ఇందిరా గాంధీ ఆదేశం..

మత ప్రాతిపదికన భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ పశ్చిమ, తూర్పు పాకిస్థాన్‌గా అవతరిచింది. ప్రస్తుత బంగ్లాదేశ్‌ను అప్పుడు తూర్పు పాకిస్థాన్ గా అని పిలిచేవారు. ప్రస్తుత పాకిస్థాన్‌ పశ్చిమ పాకిస్థాన్‌గా ఉండేది. ఆ సమయంలో తూర్పు పాకిస్థాన్ పార్టీ అవామీ లీగ్ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్‌ సైన్యం పాక్ లోని బెంగాలీ, హిందూ నివాసితులపై దాడులకు పాల్పడింది. ముఖ్యంగా పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, తూర్పు పాకిస్తాన్‌లో ఎన్నికల ఫలితాలను అణగదొక్కడం చేసింది. దీంతో బంగ్లాదేశ్ విముక్తి కోసం ఉద్యమం మొదలైంది. మొదటిసారిగా 1971 మార్చి 26న తూర్పు పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడాలని..స్వాతంత్య్రం సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. అటు పశ్చిమ పాకిస్తాన్  భారత్ కు చెందిన 11 ఎయిర్ బేస్‌లపై వైమానిక దాడులు చేసింది. ఈ ఉద్యమానికి భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కి మద్దతు ఇచ్చారు. పాక్ పై యుద్ధానికి నాటి ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్లాను ఇందిరాగాంధీ ఆదేశించారు. 

యుద్ధానికి కారణాలు..

  • 1971 యుద్ధం భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక వివాదం చెలేరగింది. 1971  డిసెంబర్ 3న పాకిస్తాన్ 11 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై ముందస్తు వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారత్ బంగ్లా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందిరాగాంధీ ఆదేశాలతో భారత సైన్యం బెంగాలీ జాతీయవాద సమూహాలకు మద్దతు ఇచ్చింది. 
  • పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ నేతృత్వంలోని  సైనిక పాలన ద్వారా తూర్పు పాకిస్తాన్ ప్రజలపై  మారణహోమం చేశారు. దీనికి  కారణంగా యుద్ధం అనివార్యమైంది. 1971 డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్‌ను భారత్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా  భారత నౌకాదళం  కరాచీ ఓడరేవుపై ఆకస్మిక దాడి చేసింది. ఇది ట్రైడెంట్ అనే పేరుతో ఆపరేషన్ను విజయవంతంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా నిర్వహించింది. ఆ తర్వాత  ముక్తి బహినీ గెరిల్లాలు పశ్చిన పాకిస్తాన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడటానికి భారత దళాలతో చేతులు కలిపాయి.
  • యుద్ధ సమయంలో  పాకిస్తాన్ సదరన్ కమాండ్ ఎటువంటి చర్యకు పాల్పడకుండా భారత సైన్యం దేశ సరిహద్దులను రక్షించింది. లోంగేవాలా,పర్బత్ అలీలో  పాకిస్తాన్ యొక్క సాయుధ దళాలను  భారత దళాలు  మట్టుబెట్టాయి.  లెఫ్టినెంట్ కల్నల్ భవానీ సింగ్ నేతృత్వంలోని ప్రఖ్యాత 10 పారా కమాండో బెటాలియన్‌కు చెందిన సైనికులు.. పాకిస్తాన్ పట్టణం చచ్రోపై దాడి చేశారు. 
  • డిసెంబర్ 14న తూర్పు పాకిస్థాన్ గవర్నర్‌తో సమావేశం జరుగుతున్న ఇంటిపై  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది.  ఈ దాడితో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. ఫలితంగా లొంగిపోయే ప్రక్రియను ప్రారంభించింది.  అధికారికంగా  1971 డిసెంబర్ 16న దాదాపు 93,000 మంది పాకిస్తానీ బలగాలు భారత్ కు లొంగిపోయాయి. ఆ విధంగా 1971 డిసెంబర్ 16 న, బంగ్లాదేశ్ కొత్త దేశంగా అవతరించింది. పశ్చిమ పాకిస్తాన్ ..పాకిస్తాన్ కు మారింది. 
  • ఇండో పాక్ వార్ చారిత్రక యుద్ధంగా నిలిచింది. అందుకే దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న 'విజయ్ దివస్'గా జరుపుకుంటారు.  ఈ యుద్ధంలో దాదాపు 3,900 మంది భారత సైనికులు అమరులయ్యారని, దాదాపు 9,851 మంది గాయపడ్డారు.