
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో దళపతి విజయ్ (Vijay) హీరోగా తెరకెక్కిన బ్లాక్ బ్లాస్టర్ లియో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీలో 2 తేదీల్లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు.
ఇండియాలో నవంబర్ 24 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఇక వరల్డ్ వైడ్గా నవంబర్ 28 నుంచి అందుబాటులోకి వస్తోందని మేకర్స్ ట్వీట్ చేశారు. ముందుగా ఈ సినిమా నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వచ్చాయి. ఇక మేకర్స్ ఇచ్చిన ఆఫీషయల్ అప్డేట్తో..థియేటర్స్లో చూడటం మిస్ అయిన దళపతి ఫ్యాన్స్కు పండుగే అని చెప్పుకోవాలి.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా..దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లియో మూవీ వరల్డ్ వైడ్గా రూ.600కోట్లకు పైగా కలెక్ట్ చేసి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
#Leo va paakanum! #Leo va paakanum! ?
— Seven Screen Studio (@7screenstudio) November 20, 2023
Inime Netflix la Pakalam ❤️#Leo will be streaming from November 24th in India and globally on the 28th in Tamil, Telugu, Malayalam, Kannada, and Hindi ✨#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial… pic.twitter.com/FPeu68otna