
ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు మరో షాక్తగిలింది. మాల్యా తమకు రూ.1,253.2 కోట్ల బాకీ ఉన్నాడంటూ యూకే లిక్కర్ దిగ్గజం ‘డియాజియో’శుక్రవారం యూకే హైకోర్టులో పిటిషన్ వేసింది.ఆరేళ్ల క్రితం ‘యునైటెడ్ స్పిరిట్స్’ను మాల్యా నుంచి రూ.276.96 కోట్లకు కొన్నట్లు చెప్పింది. ఇందుకోసం చేసుకున్న ఒప్పందాన్ని మాల్యా ఉల్లంఘించారని ఆరోపిస్తోంది. మాల్యా, ఆయన కొడుకు సిద్ధార్థ..డయాజియో, మరో కంపెనీ నుంచి అక్రమ పేమెంట్లు జరిపారనేది మరో ఆరోపణ. దీని వల్ల రూ.976.28కోట్ల నష్టం జరిగిందని కంపెనీ చెబుతోంది. కేసును విచారించిన యూకే హైకోర్టు.. ఇప్పటిదాకా లాయర్లకు చెల్లించాల్సిన రూ.30.82 లక్షలను వెంటనే చెల్లించాలని మాల్యాను ఆదేశించింది. కేసు పూర్తి విచారణనుమే 23కు వాయిదా వేసింది.