అరడజనుకుపైగా ప్రాజెక్టులతో సూపర్ స్పీడ్‌‌‌‌తో విజయ్ సేతుపతి

అరడజనుకుపైగా ప్రాజెక్టులతో సూపర్ స్పీడ్‌‌‌‌తో విజయ్ సేతుపతి

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం అరడజనుకుపైగా ప్రాజెక్టులతో సూపర్ స్పీడ్‌‌‌‌తో దూసుకుపోతున్నాడు. వాటిలో ‘విడుదలై’ సినిమా ఒకటి. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్‌‌‌‌.రెడ్‌‌‌‌ కుమార్, ఉదయనిధి స్టాలిన్‌‌‌‌  నిర్మిస్తున్నారు. కథను పొడిగించడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మంగళవారం రెండు పార్ట్స్ షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించారు మేకర్స్. డిసెంబర్‌‌ ఎండింగ్‌కి పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ పూర్తిచేసి, జనవరి 26న ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రూరల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలేజ్  లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు.

మరోవైపు తను నటించిన ‘డీఎస్‌‌‌‌పీ’ సినిమా నుంచి నిన్న సాయంత్రం ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘నల్ల ఇరుమ్మ’ అంటూ సాగే పాటలో సేతుపతి పెళ్లి కొడుకు గెటప్‌‌‌‌లో ఆకట్టుకున్నాడు. అలాగే సూట్‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌గానూ ఇంప్రెస్ చేశాడు. ఏడేళ్ల గ్యాప్‌‌‌‌ తర్వాత ఉదిత్ నారాయణన్  తమిళంలో పాడిన పాట కావడంతో మంచి హైప్ వచ్చింది. డి.ఇమ్మాన్ కంపోజ్ చేశాడు. పొన్రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ బైలింగ్విల్‌‌‌‌ ‘మైకేల్’తో పాటు హిందీలో మెరీ క్రిస్మస్‌, ముంబైకర్, జవాన్ చిత్రాల్లో సేతుపతి నటిస్తున్నాడు. అలాగే ‘గాంధీ టాక్స్’ అనే మూకీ డ్రామా కూడా చేస్తున్నాడు.