హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు.. నేను మా నాన్నలా కాదు!

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు.. నేను మా నాన్నలా కాదు!

సినీ ఇండస్ట్రీలోకి మరో స్టార్ హీరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు తమిళ స్టార్ విజయ్ సేతుపతి కొడుకు సూర్య. ఆయన హీరోగా వెండితరకు పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ స్టెంట్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు ఈ సినిమాను డైరెక్టర్ చేయనున్నాడు. బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫీనిక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. యాక్షన్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి కొడుకు హీరో సూర్య మాట్లాడుతూ.. మా నాన్న దారిలో నేను చేయాలనుకోవడం లేదు. నాకంటూ ఒక కొత్త వే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అందుకే మా సినిమా మేకర్స్ కూడా ఇంట్రడ్యూసింగ్ సూర్య అని అంటున్నారు తప్పా.. సూర్య విజయ్ సేతుపతి అనడం లేదు. నాకు కావల్సింది కూడా అదే. నేను హీరో అవడంపై అమ్మా, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు.. అంటూ చెప్పుకొచ్చారు సూర్య. ఇక త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.