మరో 50 స్టోర్లను తెరుస్తాం : విజయ్​ సుబ్రమణియం

మరో 50 స్టోర్లను తెరుస్తాం :  విజయ్​ సుబ్రమణియం

హైదరాబాద్​, వెలుగు: దేశ వ్యాప్తంగా తమకు ప్రస్తుతం 164 స్టోర్లు ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 50 స్టోర్లను తెరుస్తామని, ఫర్నిచర్​ కంపెనీ రాయల్​ ఓక్​ చైర్మన్​  విజయ్​ సుబ్రమణియం అన్నారు. హైదరాబాద్​లోని నాచారంలో శనివారం కొత్త స్టోర్​ఓపెన్​  చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు తెలంగాణలో 28 స్టోర్లు ఉన్నాయని చెప్పారు.   ‘‘మా ఫర్నిచర్​ను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని అమ్ముతాం. మంచి డిజైన్, క్వాలిటీ, తక్కువ ధరలు మా ప్రత్యేకత. 

ఒక్కో స్టోర్​  ఏర్పాటుకు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మేం రూ.వెయ్యి కోట్ల టర్నోవర్​ సాధించాం. ఈసారి రూ.1,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. మనదేశంలో ఫర్నిచర్​ మార్కెట్​సైజు26.8 బిలియన్​ డాలర్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మాకు 25 శాతం మార్కెట్​ వాటా ఉంది”అని ఆయన వివరించారు.