
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) గురించి, అయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధంలేకుండా ఇండియన్ వైడ్ గా ఆయనకు కోట్ల సంఖ్యలు అభిమానులు ఉన్నారు. అందుకే విజయ్ నుండి సినిమా వస్తుంది అంటే.. అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయం. సరికొత్త రికార్డ్స్ సెట్ చేయడంలో విజయ్ కింగ్. ప్రస్తతం ఆయన దర్శకుడు వెంకట్ ప్రభుతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది ఈ సినిమా.
ఇదిలా ఉంటే.. దళపతి విజయ్ ఇటీవలే రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన పార్టీకి తమిళగ వెట్రి కజగం అని నామకరణం చేసుకున్నారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు విజయ్. ఇందులో భాగంగానే తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే..ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అద్భుతం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రం తోపాటు రివార్డు కూడా అందజేయనున్నారు. ఇదే విషయాన్నీ తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.
చెన్నైలోని తిరువాన్మియూర్‌లో జూన్ 28, జూలై 3 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సంవత్రం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా బహుమతులు అందజేయనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళనాట వైరల్ గా మారింది. అంతేకాదు.. ఈ న్యూస్ తెలిసిన కొంతమంది రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం కోసమే విజయ్ ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.