చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ ఓటింగ్లో తటస్థంగా వ్యవహరించారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల్లో 24 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వం సునాయాసంగా నెగ్గింది. 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలు ఈ ఓటింగ్కు దూరంగా ఉన్నారు. సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
VIDEO | The C Joseph Vijay-led TVK government faces floor test in the Tamil Nadu Assembly.
— Press Trust of India (@PTI_News) May 13, 2026
The ruling TVK has an overall strength of 107, including the Speaker who may not vote. The party's Tirupattur MLA, R Seenivasa Sethupathy won't be able to cast his vote following a High… pic.twitter.com/ANnWyIUKry
విజయ్ తిరుచ్చి స్థానానికి రాజీనామా చేశాక టీవీకే పార్టీకి స్వతహాగా 107 సీట్లు ఉన్నాయి. టీవీకేకు కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, సీపీఐ, సీపీఎంలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. అయితే.. ఫ్లోర్ టెస్ట్‌లో టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి పాల్గొనకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. ఫ్లోర్ టెస్ట్‌లో విజయ్ గెలవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి తగ్గిపోయింది. అయితే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్. కామరాజ్.. విజయ్ టీవీకేకు తన మద్దతును ప్రకటించారు. దీంతో.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు పెరిగింది.
అయితే.. అనూహ్యంగా అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించింది. ఈ 30 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది విశ్వాస పరీక్షలో విజయ్ పార్టీకి మద్దతుగా ఓటు వేశారు. ఇలా.. విజయ్ ప్రభుత్వానికి మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు అనకూలంగా ఓటు వేశారు.
22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. పళనిస్వామికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా వ్యవహరించారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల అనూహ్య మద్దతుతో విజయ్ టీవీకే పార్టీ విశ్వాస పరీక్షలో అలవోకగా గట్టెక్కింది.
