రిలయన్స్ స్మార్ట్ బజార్ పాయింట్​లో విజయలక్ష్మి డీర్ బ్రాండ్ దాల్

రిలయన్స్ స్మార్ట్ బజార్ పాయింట్​లో విజయలక్ష్మి డీర్ బ్రాండ్ దాల్
  • జనాలకు మరింత చేరువయ్యేందుకు సంస్థ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: నాణ్యమైన పప్పు దినుసులను జనాలకు మరింత చేరువ చేసేందుకు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ ​దాల్​ను ఇక నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్, స్మార్ట్ బజార్​లో అందుబాటులో ఉంచనున్నట్లు విజయలక్ష్మి దాల్ మిల్స్ సంస్థ తెలిపింది.

33 ఏండ్లుగా నాణ్యతతో కూడిన మినపప్పు, కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పు, పుట్నాలు, ఇడ్లీరవ్వను అందిస్తూ జనాల ఆదరణను సంపాదించామని పేర్కొంది. నేరుగా​ పొలాల నుంచే పంటలను సేకరించి నాణ్యమైన, ఆరోగ్యవంతమైన, రుచికరమైన పప్పు దినుసులను అందిస్తున్నామని సోమవారం ఓ  ప్రకటనలో తెలిపింది.