Coolie Trailer : రజనీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్.. అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్!

Coolie Trailer : రజనీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్..  అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్!

సూపర్ స్టార్  రజనీకాంత్‌ ( Rajinikanth )నటించిన 'కూలీ' ( Coolie ) సినిమా భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14 ప్రేక్షకుల ముందుకు రానుంది.  డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ ( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఈ రోజు ( శనివారం 2, ఆగస్టు 2025 ) ఈ సినిమా ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లోని హై-ఆక్టేన్ యాక్షన్‌ను ప్రతిబింబిస్తోంది.

రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే పాటలు మంచి క్రేజ్  తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ లోకేష్ తనదైన శైలిలో 'కూలీ' ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడన్న అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. ఈ సినిమా లో రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, లోకేష్ మార్క్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇది పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటున్నారు అభిమానులు.

ఈ చిత్రం అంతా వాచీల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకి విలన్ గా నాగార్జున నటించారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో అత్రుతగా చూస్తున్నారు. ఈ'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా,   సైమన్ గా నాగార్జున, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్ గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు.  అమీర్ ఖాన్ దహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రజనీకాంత్ అభిమానులకు పండగే అని చెప్పాలి. రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్, అనిరుధ్ వంటి త్రయం కలిసి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఆదే రోజు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన 'వార్ 2' కూడా రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈరెండు చిత్రాలు షేక్ చేయబోతున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.