మేసేటోళ్లకు కాదు పని చేసేటోళ్లకు పదవి దక్కాలి

మేసేటోళ్లకు కాదు పని చేసేటోళ్లకు పదవి దక్కాలి

సీఎం కేసీఆర్​పై ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో విజయశాంతి సెటైర్లు

హైదరాబాద్, వెలుగు: అల్లావుద్దీన్ అద్భుత దీపంలా జీహెచ్ఎంసీ ఎన్ని కల్లో అసదుద్దీన్‌‌‌‌తో అద్భుతాలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ‌‌‌‌ఆశ పడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌‌‌‌పై ఫేస్‌‌‌‌బుక్ వేదికగా ఆమె విమర్శలు చేశారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడినా కూడా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన దొర అహంకారం చూపిస్తున్నరు. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు గ్రేటర్​లో వంద సీట్ల కు పైగా గెలుస్తమని గంభీరమైన ప్రకటనలు చేస్తూ ఓటర్లను మభ్య పెడుతున్నరు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని మేసేటోళ్లకు కాకుండా మేయరు అనే వారికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న’’ అన్నారు.