V6 News

అర్హులందరికీ  సదరం సర్టిఫికెట్లు

అర్హులందరికీ  సదరం సర్టిఫికెట్లు

వికారాబాద్​, వెలుగు: సదరం సర్టిఫికెట్లు అర్హులైన వారందరికీ మంజూరయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్​లో సదరం క్యాంపుల నిర్వహణ, యూడీఐడీ పోర్టల్​లో డేటా అప్​లోడ్​పై డీపీఎం, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. సదరం దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్​లో అప్​లోడ్ చేయాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరిని క్యాంపులకు వచ్చేలా అధికారులు చొరవ చూపాలని స్పష్టం చేశారు.