రిజర్వేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసొచ్చిన అదృష్టం..ఒకే ఫ్యామిలీకి మూడు పదవులు

రిజర్వేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసొచ్చిన అదృష్టం..ఒకే ఫ్యామిలీకి మూడు పదవులు
  • సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవితో పాటు రెండు వార్డు సభ్యుల పోస్టులు
  • వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా మంతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో ఒకే ఎస్టీ ఫ్యామిలీ

వికారాబాద్, వెలుగు : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఓ ఫ్యామిలీకి కలిసొచ్చాయి. సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవితో పాటు రెండు వార్డు సభ్యుల స్థానాలూ ఒకే కుటుంబానికి దక్కనున్నాయి. వివరాల్లోకి వెళ్తే... వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా బషీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని మంతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో 494 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్నాయి. గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఓ వార్డు పదవి ఎస్టీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, మరో వార్డు ఎస్టీ మహిళకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. 

ఈ గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం ఒక్కటే ఉంది. భీమప్పతో పాటు అతడి భార్య వెంకటమ్మ గ్రామంలో ఉంటుండగా.. అతడి కుమారులు ఎల్లప్ప, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోడళ్లు స్వప్న, సుజాత పిల్లలతో కలిసి చందానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండు వార్డు సభ్యుల పదవులు ఎస్టీకి రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో ఈ కుటుంబానికి చెందిన ఆరుగురిలో ముగ్గురికి మూడు పదవులు దక్కనున్నాయి.