స్మార్ట్​ మీటర్ల తయారీకి వికాస్ ​లైఫ్​కేర్​ జేవీ

స్మార్ట్​ మీటర్ల తయారీకి వికాస్ ​లైఫ్​కేర్​ జేవీ

న్యూఢిల్లీ: రీసైక్లింగ్​ రంగంలోని వికాస్​ లైఫ్​కేర్​ లిమిటెడ్​ స్మార్ట్ ​మీటర్ల తయారీ చేపట్టడానికి ఇంద్రప్రస్థ గ్యాస్​ లిమిటెడ్​ (ఐజీఎల్​)తో చేతులు కలిపింది. ఐజీఎల్​ జెనిసిస్​ టెక్నాలజీస్​ పేరుతో ఇందుకోసం జాయింట్ వెంచర్​ కంపెనీని ఏర్పాటు చేశారు. స్మార్ట్​మీటర్ల తయారీ ప్రాజెక్టు కోసం  రూ. 110 కోట్లను జాయింట్​ వెంచర్​ కంపెనీలో వెచ్చించనున్నట్లు వికాస్​ లైఫ్​కేర్​ రెగ్యులేటరీ ఫైలింగ్​లో వెల్లడించింది.

జాయింట్​ వెంచర్​ కంపెనీలో ఇంద్రప్రస్థ గ్యాస్​ లిమిటెడ్​కు 51 శాతం వాటా, వికాస్​ లైఫ్​కేర్​ లిమిటెడ్​కు 49 శాతం వాటా ఉంటాయని పేర్కొంది. గ్యాస్​ మీటర్ల తయారీ, సేల్స్​, డిస్ట్రిబ్యూషన్​, సప్లయ్​ వంటి కార్యకలాపాలను జాయింట్​ వెంచర్​ కంపెనీ చేపట్టనున్నట్లు వివరించింది. ప్లాస్టిక్​ వేస్ట్​ను ఇండస్ట్రియల్​ అప్లికేషన్స్​ కోసం పెల్లెట్స్​, ఇంటర్​లాకింగ్ ​టైల్స్​గా వికాస్​ లైఫ్​కేర్​ రీసైకిల్​ చేస్తోంది.