ప్రశాంత వాతారణంలో ఎన్నికల నిర్వహించాలి : వికాస్​రాజ్

ప్రశాంత వాతారణంలో ఎన్నికల నిర్వహించాలి : వికాస్​రాజ్
  • స్టేట్​ చీఫ్​ ఎలక్షన్​ ఆఫీసర్​ వికాస్​రాజ్​ 
  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్​  

మంచిర్యాల, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణలో నిర్వహించడానికి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని స్టేట్​ చీఫ్​ ఎలక్షన్​ ఆఫీసర్​ వికాస్​రాజ్​ ఆదేశించారు. అడిషనల్​ డీజీపీ సంజయ్​కుమార్​ జైన్ తో కలిసి శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్​లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు, పోలీస్​ కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలు, ఏసీపీలతో కలెక్టరేట్​లో ఈ మీటింగ్​కు హాజరయ్యారు.

ఈ నెల30 వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఓటరు నమోదు, పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అడ్వర్లయిజ్​మెంట్లకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. సువిధ యాప్ ను నిరంతరం పరిశీలిస్తూ ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. నివేదికలను ప్రతి రోజు సమర్పించాలని ఆదేశించారు.

దివ్యాంగుల ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చెక్​ పోస్టుల వద్ద నగదు, మద్యం తరలించకుండా వెహికల్స్​ను చెక్​ చేయాలన్నారు. స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా కళాజాత కార్యక్రమంలో పాల్గొన్న వికాస్​రాజ్​ అధికారులతో కలిసి ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ అని ప్రతిజ్ఞ చేశారు.