మురుగదాస్ డైరెక్షన్ లో విక్రమ్

మురుగదాస్ డైరెక్షన్ లో  విక్రమ్

తమిళనాట కమల్‌‌‌‌‌‌‌‌ హాసన్ స్థాయిలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పెరిమెంట్స్‌‌‌‌‌‌‌‌ చేసే మరో హీరో విక్రమ్. క్యారెక్టర్ కోసం అతను ఎంతలా కష్టపడతాడో సేతు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలు ఇప్పటికే నిరూపించాయి. ఈ వెర్సటైల్ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇప్పుడొక వెర్సటైల్ డైరెక్టర్ చేయి కలుపుతున్నాడు. డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ మూవీస్​తో హీరోలను కొత్తగా ప్రెజెంట్‌‌‌‌‌‌‌‌ చేసే మురుగదాస్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌లో విక్రమ్‌ నటించ బోతున్నాడు.  ఇటీవల విక్రమ్‌‌‌‌‌‌‌‌ను కలిసి ఓ ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ లైన్ చెప్పాడట మురుగదాస్. కొత్త తరహా కాన్సెప్ట్స్‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఎప్పుడూ ముందుండే విక్రమ్‌‌‌‌‌‌‌‌ వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సినిమాలకు కేరాఫ్ అయిన సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ రానుంది.  తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉండేలా కేర్ తీసుకునే మురుగదాస్.. విక్రమ్‌‌‌‌‌‌‌‌తో ఎలాంటి సినిమా చేయనున్నాడో చూడాలి. ఇక విక్రమ్ నటించిన థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ ‘కోబ్రా’ మే 26న రిలీజ్ కానుంది. మణిరత్నం రూపొందిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌‌‌‌‌‌‌‌’ కూడా రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడీ అవుతోంది.