తంగలాన్.. ప్యాచ్ వర్క్‌‌ను సీరియస్‌‌గా పూర్తి చేసే పనిలో విక్రమ్

తంగలాన్.. ప్యాచ్ వర్క్‌‌ను సీరియస్‌‌గా పూర్తి చేసే పనిలో విక్రమ్

డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ, ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు విక్రమ్. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్‌‌లో ‘తంగలాన్’ చిత్రంలో నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్స్.

ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆరిస్టులంతా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌‌గా మాళవిక మోహనన్‌‌ అతికష్టంతో తన డబ్బింగ్ పార్ట్‌‌ను పూర్తి చేసినట్టు ట్విటర్‌‌‌‌లో పోస్ట్ చేసింది. తాజాగా విక్రమ్ తన డబ్బింగ్‌‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

ప్యాచ్ వర్క్‌‌ను సీరియస్‌‌గా పూర్తి చేసే పనిలో ఉన్నానని ట్వీట్ చేస్తూ డబ్బింగ్ చెబుతున్న ఫొటోను విక్రమ్ పోస్ట్ చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.