‘విక్రమ్ వేద’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘విక్రమ్ వేద’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇద్దరు హీరోలు నటిస్తున్నారంటే ఎవరి క్యారెక్టర్ ఎంత అనే లెక్కలు మొదలవుతాయి. కానీ అలాంటి లెక్కలు పక్కనపెట్టి కంటెంట్‌‌‌‌పై మాత్రమే ఫోకస్‌‌‌‌ పెట్టేలా చేసిన చిత్రం ‘విక్రమ్ వేద’. ఐదేళ్ల క్రితం తమిళంలో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో అదే పేరుతో వస్తోంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్స్ పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఈ నెల 8న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించింది. 

ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ కావడంతో, హిందీలో ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి నెలకొంది. గ్యాంగ్ స్టర్‌‌‌‌‌‌‌‌గా హృతిక్, పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా సైఫ్ నటిస్తున్నారు. రాధికా ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ, యోగితా బిహాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వై నాట్ స్టూడియోస్‌‌‌‌, రిలయన్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌, టి సిరీస్‌‌‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నెలాఖరులో రిలీజ్ అని టీమ్ చెబుతున్నప్పటికీ రిలీజ్ పోస్ట్ పోన్ అవబోతోందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికీ ఫుల్‌‌‌‌ స్టాప్ పెట్టేలా ఈనెల 30నే సినిమాను విడుదల చేయబోతున్నట్టు మరోసారి కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. తమిళంలో సక్సెస్ సాధించిన ఈ కాన్సెప్ట్‌‌‌‌కు హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!