ఫ్యాన్స్కు హృతిక్ రోషన్ బర్త్ డే ట్రీట్

ఫ్యాన్స్కు హృతిక్ రోషన్ బర్త్ డే ట్రీట్

హృతిక్  రోషన్ తన (48)వ పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు . తన కొత్త సినిమా విక్రమ్ వేద హిందీ రీమేక్ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఈ లుక్ లో హృతిక్ రఫ్ అండ్ టప్ గా గడ్డంతో  రక్తంతో తడిసి ఉన్నాడు. విక్రమ్ వేద మూవీ తమిళంలో వేద పాత్రను విజయ్ సేతుపతి చేశారు. విక్రమ్ పాత్రను మాధవన్ చేశారు. హిందీ రీమేక్ లో హృతిక్  వేద పాత్ర చేస్తుండగా.. విక్రమ్ క్యారెక్టర్ ను సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2022 సెప్టెంబర్ 30న  థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే కీలక పాత్ర చేస్తుంది. ఒరిజనల్ తీసిన పుష్కర్ గాయత్రి హిందీ రీమేక్ కు డైరెక్షన్ చేస్తున్నారు