‘ట్వల్త్ ఫెయిల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ మస్సే(Vikrant Massey) సుపరిచితం. ట్వల్త్ ఫెయిల్ లోని విక్రాంత్ నటనకు, తన హవాభాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో విక్రాంత్ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక తెలియని జోష్.
ప్రస్తుతం హీరో విక్రాంత్ మస్సే సెక్టార్ 36 (Sector 36) అనే మూవీ చేస్తున్నాడు. దీపక్ డోబ్రియాల్, దినేష్ విజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నా ఈ మూవీని ఆదిత్య నింబల్‌కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెక్టార్ 36 మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ 2006లో జరిగిన నిఠారీ వరుస హత్యల ఆధారంగా రూపొందించబడింది.సెక్టార్ 36 36 సినిమాను సెప్టెంబర్ 13 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతుంది.
ALSO READ | Mystery Thriller OTT: ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ..అస్సలు మిస్సవ్వకండి
నోయిడాలోని సెక్టార్ 36 మురికివాడ ప్రాంతంలో పిల్లలు వరుసగా కిడ్నాప్ అయితుంటారు. అయితే ఆ కిడ్నాప్ చేసేది ఎవరు.. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు అనేది స్టోరీ. విక్రాంత్ మస్సే ఇందులో పిల్లలను కిడ్నాప్ చేసి చంపే సీరియల్ కిల్లర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ, “ఈ చిత్రం కోసం ప్రేమ్ అనే కిల్లర్ పాత్రలో అడుగుపెట్టడం..నేను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఉంది. అసలు ఒక వ్యక్తిగా భయంకరమైన కిల్లర్ పాత్రలో అందరిని ఒప్పించేలా చేయడం చాలా కష్టం" అన్నారు.