మంత్రి సాక్షిగా సర్పంచులకు అవమానం

మంత్రి సాక్షిగా సర్పంచులకు అవమానం

మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచులకు అవమానం జరిగింది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్  బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సర్పంచులకు చిన్నచూపు ఎదురైంది.

అర్బన్ నేతలకు కుర్చీలు వేసి, మిగతా వారిని నేలపై కూర్చొబెట్టారు. మహబూబాబాద్ రూరల్ మండలానికి చెందిన సర్పంచులు, మహిళా సర్పంచుల భర్తలను కింద కూర్చోబెట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్ సాక్షిగా ఈ ఘటన జరిగింది.