జియో సిగ్నల్​ రావడం లేదని గ్రామస్తుల ధర్నా

జియో సిగ్నల్​ రావడం లేదని గ్రామస్తుల ధర్నా

బజార్​ హత్నూర్, వెలుగు: మండలంలోని పిప్పిరి గ్రామంలో వారం రోజులుగా జియో సిగ్నల్ రావడం లేదని సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు యువకులు అంతరాష్ట్ర  రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అధికారులకు ఇది వరకే అనేక సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు.

ఇంటర్నెట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రోడ్డుపై ధర్నా చేయడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. తహసీల్దార్​ సోము, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు.