ఊర్లోకి వచ్చి పిల్లలు కన్నపెద్ద పులి.. గదిలో భద్రపరిచిన గ్రామస్తులు

ఊర్లోకి వచ్చి పిల్లలు కన్నపెద్ద పులి.. గదిలో భద్రపరిచిన గ్రామస్తులు

పులి అనే మాట వింటేనే అమ్మో అని భయపడతాం.. అక్కడ పులి ఉంది అంటేనే గుండెలు ఆగుతాయి.. అలాంటి ఓ పెద్దపులి.. ఊర్లోకి వచ్చింది.. ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో పురుడు పోసుకుంది. నాలుగు పిల్లలను పెట్టింది. ఈ ఘటన నంధ్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అమ్మో పులి అనుకునే లోపే.. ఆ పక్కన నాలుగు పెద్దపులి పిల్లలు సైతం వారి కంట పడ్డాయి. దీంతో విషయం మొత్తం గ్రామస్తులకు అర్థం అయ్యింది. అదేంటంటే... పులి దాడి చేయటానికి రాలేదు.. పిల్లలను కనటానికి వచ్చింది అని.

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్తులు... కుక్కలు దాడి చేయకుండా.. ఓ గదిలో భద్రపరిచారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసుకున్న చుట్టుపక్కల జనం.. పెద్దపులి పిల్లలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.

పిల్లలకు జన్మనిచ్చిన పెద్దపులి అక్కడ ఎక్కడా లేదని.. పిల్లల కోసం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు గ్రామస్తులు. అటవీ అధికారులు వెంటనే పులి పిల్లలను గ్రామం నుంచి తరలించాలని కోరుతున్నారు. పులి అంటే అమ్మో అంటాం కదా.. పులి పిల్లలు మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి. గ్రామస్తులు వాటిని ఎత్తుకుని ఆలనాపాలనా చూస్తున్నారు. పులి పిల్లలకు డబ్బా పాలు పడుతున్నారు..