గ్రామాల అభివృద్ధి  కాంగ్రెస్ తోనే సాధ్యం.. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్

గ్రామాల అభివృద్ధి  కాంగ్రెస్ తోనే సాధ్యం.. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్

కాగజ్ నగర్, వెలుగు:  గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఆదివారం కౌటల మండలం తాటినగర్  సర్పంచ్ కత్కర్ మౌనిక అనిల్, కాగజ్ నగర్ మండలం కోయవాగు సర్పంచ్ చింతపురి లక్ష్మీ, ఉప సర్పంచ్,  వార్డు సభ్యులు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గణపతి, కౌటల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగారం, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ జానకిరామ్, వెంకన్న, శ్యామ్ రావు పాల్గొన్నారు.