
సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకుడు. జీ స్టూడియోస్ బ్యానర్‌పై కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9న సినిమా రిలీజ్ కానుంది. శనివారం ఈ మూవీ టీజర్‌ను వరుణ్ తేజ్ లాంచ్ చేసి టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
అంగ వైకల్యంతో బాధపడే మిడిల్ ఏజ్ ఫాదర్ క్యారెక్టర్‌లో సముద్రఖని కనిపిస్తాడు. అయినా కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాలనే ఆలోచనలతో ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారిని ప్రశ్నిస్తూనే ఉంటాడు. తండ్రిని కూడా విమానం ఎక్కించమని బతిమలాడుకుంటూ ఉంటాడు. బాగా చదువుకుంటే నువ్వే విమానం ఎక్కొచ్చని కొడుకుతో అంటుంటాడు వీరయ్య. తండ్రీ కొడుకుల మధ్య ఈ విమానం గోల ఏంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.