ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి కృషి : వినయ్రెడ్డి

ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి కృషి : వినయ్రెడ్డి
  • కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్​రెడ్డి 

ఆర్మూర్, వెలుగు :- ఆర్మూర్​ మున్సిపల్​ అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్​రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్ టౌన్​లోని జర్నలిస్టు కాలనీ 19వ వార్డు, ఎన్టీఆర్ కాలనీ, 7వ వార్డులో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. టీయూఎఫ్​ఐడీసీ, యూఐడీఎఫ్ నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మిస్తామన్నారు.  సీఎం రేవంత్​ రెడ్డి ఆర్మూర్​ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు.

 ఆయన వెంట ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్, బీసీ సెల్​ టౌన్​ ప్రెసిడెంట్ దోండి రమణ, బత్తుల శ్రీనివాస్ గౌడ్, సుంకె శ్రీనివాస్, కొక్కెర భూమన్న, సత్యనారాయణగౌడ్​, రాజేందర్​ గౌడ్, గడ్డం శంకర్, దమ్మన్నస్వామి, అరుణ్,  పులి గంగాధర్​ తదితరులు పాల్గొన్నారు.