V6 News

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంగా ఉన్నారు... రూమర్స్ నమ్మొద్దు..! భార్య ఆండ్రియా క్లారిటీ 

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంగా ఉన్నారు... రూమర్స్ నమ్మొద్దు..! భార్య ఆండ్రియా క్లారిటీ 

భారత మాజీ క్రికెటర్ అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. గతంలో వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన క్రమంలో అతని చిరకాల మిత్రుడు సచిన్ టెండూల్కర్ ఆర్థిక సాయం అందించినట్లు వార్తలొచ్చాయి. కాంబ్లీ మిత్రుడు మార్కస్ పలువురు క్రికెటర్లను, కాంబ్లీ శ్రేయోభిలాషులను సంప్రదించి అతనికి ఆర్థిక సాయం అందేలా చూస్తున్నట్లు సమాచారం. అయితే..కాంబ్లీ ఆరోగ్యం విషమిస్తోదంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు కాంబ్లీ భార్య ఆండ్రియా. కాంబ్లీ ఆరోగ్యం నిలకడగా ఉందని..రూమర్స్ నమ్మొద్దని అన్నారు ఆండ్రియా.

దేవుడి దయవల్ల వినోద్ క్షేమంగా ఉన్నారని... ఆయన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలీదని అన్నారు ఆండ్రియా. కాంబ్లీ ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ ను నమ్మొద్దని సూచించారు ఆండ్రియా.ఈ క్లిష్ట సమయాల్లో కాంబ్లీకి ఆర్థిక, మానసిక మద్దతు అందించేందుకు మార్కస్ కౌటో ఒక వాట్సాప్ గ్రూప్‌ కూడా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ఒక వాట్సాప్ గ్రూప్  క్రియేట్ చేశానని.. గత ఆరు నెలలుగా కాంబ్లీ జ్ఞాపకశక్తికి సంబంధించి సమస్య ఉన్నప్పటికీ పూర్తిగా క్షీణించలేదని తెలిపాడు మార్కస్. కాంబ్లీకి చాలా విషయాలు గుర్తులేకపోయినా... మనం ఏదైనా చెబితే గుర్తొస్తుందని అన్నారు మార్కస్.కాంబ్లీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో మద్యం పూర్తిగా మానేశాడని.. అప్పుడప్పుడు అటుగా వెళ్లేవారిని సిగరెట్ ఇవ్వమని అడుగుతుంటాడని తెలిపారు మార్కస్.