
ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదన్నారు ప్రముఖ నటుడు రజనీకాంత్. సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA) పై ఈశాన్య రాష్ట్రాలు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ర్యాలీలు, ఆందోళనలు, భారీ ప్రదర్శనలతో పాటు అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయి.
దీనిపై స్పందించిన రజనీకాంత్ …సమస్యకి హింస పరిష్కార మార్గం కాకూడదని… జాతి, సమగ్రత, ఐక్యతని దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా శాంతియుతంగా ఉండాలన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింస బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింస బాధ కలిగిస్తుందన్నారు రజనీ.